ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం కొన్ని పరిణామాల నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయాన ఆమే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో పవన్ వీరాభిమానులు ఆమె మరో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు… తాను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్నట్లుగా ఆమె పవన్ అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ తర్వాత పవన్ అభిమానులు మరోసారి ఆమె జోలికి వెళ్లలేదు. అయితే ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు.
ఈ ఫొటో నిశితంగా పరిశీలిస్తే రేణూకు భాగస్వామి దొరికాడని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇద్దరూ చేయిపట్టుకున్న ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు చిన్నపాటి కవితను సైతం ఆమె పోస్ట్ చేశారు. ‘నీలో నా ప్రేమ దొరికింది… ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. .ఎప్పటికీ విడువకు. అవును…ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ తన మనసులో భావాలను రేణూ బయటపెట్టారు. ఈ ఒక్క కవిత చాలు… ఆమె చేయిపట్టుకున్నదెవరిదో… ఎందుకిలా వర్ణించిందన్నది తెలుసుకోవడానికి. దీన్ని బట్టి కాబోయే భర్తే అని. ఆమె చెప్పక పోయినా .ఆ కవిత ఆమె పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు ఆమె పెళ్లి వార్తలని బలపరుస్తూ మీడియాకి పెద్ద వార్త ఇచ్చినట్టు అయ్యింది. కానీ ఆమె అయితే ఫలానా వ్యక్తితో వివాహం అని గానీ…అసలు వివాహం అని గానీ ఎక్కడా బయట పెట్టలేదు. దీని పై ఆమె స్పష్టత ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.