రేణుదేశాయ్‌ షో మొదలైంది

Renu Desai announced to host dance reality show starting date

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ గురించి తెలుగు ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్‌ అంత సులభంగా మర్చిపోలేరు. పవన్‌తో దాదాపు 15 సంవత్సరాల పాటు ఆమె జీవితాన్ని పంచుకుంది. ఏవో కారణాల వల్ల పవన్‌ నుండి ఆమె విడిపోయినా కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. పవన్‌ గురించి సోషల్‌ మీడియాలో రేణుదేశాయ్‌ ఏదో ఒకటి ట్వీట్‌ చేస్తూనే ఉంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఇంత కాలం అయినా కూడా రేణుదేశాయ్‌ను గుర్తిస్తూనే ఉన్నారు. ఆ  గుర్తింపే ఆమెకు తాజాగా ‘నీతోనే డాన్స్‌’ అనే డాన్స్‌ షోకు జడ్జ్‌గా వ్యవహరించే అవకాశంను తెచ్చి పెట్టింది. 

ప్రస్తుతం స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 1 పూర్తి కావస్తుంది. ఈ వారంతో బిగ్‌బాస్‌ ముగియనున్న నేపథ్యంలో స్టార్‌ మాటీవీ కొత్త కార్యక్రమాలకు మరియు సీరియల్స్‌కు సిద్దం అయ్యింది. రెండు సీరియల్స్‌తోపాటు ఒక డ్యాన్స్‌ షోను ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవలే మా వారు ప్రకటించారు. ఉదయభాను యాంకర్‌గా ఈ షో ప్రసారం కాబోతుంది. సెప్టెంబర్‌ 30న ఈ షో ప్రారంభం కాబోతున్నట్లుగా రేణుదేశాయ్‌ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని, ప్రేక్షకులు ఆధరిస్తారని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేసిన రేణుదేశాయ్‌ ‘నీతోనే డ్యాన్స్‌’ షోలో ఉన్న ఒక ఫొటోను కూడా షేర్‌ చేసింది. రేణుదేశాయ్‌కి ఉన్న గుర్తింపు వల్ల నీతోనే డాన్స్‌ షోకు మంచి టీఆర్పీరేటింగ్‌ వస్తుందని స్టార్‌ మా వారు ఆశిస్తున్నారు.