Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ కి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయిపోయారని వార్తలు వస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగు తమ్ముళ్ళకి షాక్ ఇచ్చారు. రేవంత్ నిర్ణయం మీద టీ చర్చించడానికి టీ టీడీపీ పొలిట్ బ్యూరో తో పాటు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ నిర్ణయం వల్ల పార్టీ మీద పడే ప్రభావం, అనుసరించాల్సిన వ్యూహం మీద ఓ అంచనాకి రావాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ మీద సాఫ్ట్ కార్నర్ వున్న చంద్రబాబుకి ఆంధ్ర లోని పార్టీ నాయకుల గురించి ఆయన చేసిన ఆరోపణలతో కోపం వచ్చిందట. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశానికి రేవంత్ నేరుగా రావడం తో టీ టీడీపీ నేతలు షాక్ అయ్యారట .
రేవంత్ రాకతో తొలుత ఈ సమావేశంలో ఏమి చర్చించాలో అర్ధం గాక అయోమయంలో పడ్డారు టీడీపీ నేతలు. అయితే వెంటనే తేరుకున్న ఓ నేత మాత్రం రేవంత్ ని నేరుగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ? కారణాలు ఏంటి అని అడిగేశారట. దానికి రేవంత్ ఏమి చెప్పాడు అనేది ఇంకా బయటికి రాలేదు. ఏదేమైనా పార్టీకి గుడ్ బై కొడతాడు అనుకుంటే నేరుగా పార్టీ కార్యాలయానికే వచ్చి రేవంత్ ఇంకోసారి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.