పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశం అయ్యారు. కాగా, రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వేల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.