Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను టీడీపీ ని వీడబోనని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడడం పెద్ద సంచలనం. ఈ ఎపిసోడ్ ని ఇక్కడ దాకా నడిపించిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు అన్న దానిపై ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ కి బంధువు అయ్యే జైపాల్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పి ఈ ఎపిసోడ్ కి కర్త, కర్మ, క్రియ అయ్యాడని బహుళ ప్రచారంలో వున్న మాట. అయితే అందరూ అనుకున్నట్టు జైపాల్ కాకుండా ఇంకో యువనేత రేవంత్ ని కాంగ్రెస్ వైపు తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆయనే మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి. రేవంత్ ఎపిసోడ్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కార్తీక్ దేనని తెలుస్తోంది.
రేవంత్ తో పాటు మరికొందరిని కూడా కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి కార్తీక్ స్కెచ్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, దివంగత నేత మాధవరెడ్డి తనయుడు సందీప్ రెడ్డి ని కూడా కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి కార్తీక్ ప్లాన్ చేసాడంట. ఈ ఆపరేషన్ లో ఆయన మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తో కలిసి నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు యువకులకు అవసరమైన రాజకీయ సలహాలు ఇవ్వడంలో ఇటు జానా, అటు జైపాల్ రెడ్డి సాయం చేస్తున్నారట. మొత్తానికి ఇన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ అంటే అంతర్గత కలహాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథాన నడిపేందుకు యువ నేతలు ఈ స్థాయిలో కృషి చేయడం, ఫలితాలు తీసుకురావడం ఆశ్చర్యకరమే.