Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ని గెలుపు ముంగిట బోర్లా పడేలా చేసింది తెలుగు ఓటరు అన్న విషయం కమలనాథులకు మాత్రమే కాదు రాజకీయ పరిశీలకులు , విశ్లేషకులకు కూడా అర్ధం అయ్యింది. ఇప్పుడు ఇదే విషయం మీద తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో డీప్ డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే …హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఈ సారి నిర్ణయాత్మకం అని అర్ధం చేసుకున్న తెరాస , కాంగ్రెస్ అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నాయి. ఇక్కడ సెటిలర్స్ ఓట్లు కొల్లగొట్టాలంటే టీడీపీ పొత్తు చాలా ముఖ్యం అని రెండు పార్టీలకు తెలుసు. అయితే ఇప్పుడిప్పుడే ఆ విషయం తేలేట్టు లేకపోవడంతో విడివిడిగా సెటిలర్స్ ని ఆకట్టుకునే వ్యూహాలు రూపొందిస్తున్నాయి. సెటిలర్స్ లో సింహభాగం వున్న కమ్మ ఓట్ల కోసం ప్రత్యేక స్కెచ్ వేస్తున్నాయి.
కమ్మ ఓట్లు కాంగ్రెస్ వైపు రాబట్టుకోడానికి ఆ పార్టీ హై కమాండ్ కి రేవంత్ రెడ్డి ఓ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ కి పునర్వైభవం తేవాలన్న కృత నిశ్చయంతో వున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాల మీద కసరత్తు చేస్తున్నారు. ఈ విషయం మీద మాట్లాడేందుకు ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అందులో భాగంగా కాంగ్రెస్ లోకి లేట్ గా వెళ్లినా లేటెస్ట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ ఓ విలువైన సలహా ఇచ్చారట. తనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్న ఆలోచన పక్కనబెట్టి ఓ కమ్మ నాయకుడికి ఆ పదవి అప్పగిస్తే సెటిలర్స్ ని ఆకర్షించడంతో పాటు మున్ముందు టీడీపీ తో ఏమైనా సంప్రదింపులు జారపాలన్నా ఉపయోగపడుతుందని రాహుల్ కి చెప్పారట. ఎన్నికల ముందు లేదా తరువాత పరిస్థితులకి అనుగుణంగా టీడీపీ తో పొత్తుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని రేవంత్ ఇచ్చిన సలహా మీద రాహుల్ కూడా సీరియస్ గా దృష్టి సారించారట.