మత్తుగాళ్లను ప్రభుత్వమే కాపాడుతోందా..?

revanth reddy responds on drugs mafia in hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం కలకలం రేపిన భూకుంభకోణాన్ని మించి మరీ డ్రగ్స్ బిజినెస్.. ఉడ్దా హైదరాబాద్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో వీవీఐపీల పేర్లు బయటికి రావడంతో అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలు ఉలిక్కిపడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలే రేపాయి.

పేరున్న నటులు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు, ఐటమ్ పాపలు కూడా డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి ఎక్సైజ్ పోలీసులు నోటీసులు పంపారట. దీంతో కలకలం రేగింది. నోటీసులు అందుకున్న నటులంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను ఆశ్రయించారు. తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని, అమాయకంగా ఇరుక్కుంటే మాత్రం కాపాడతామని మా భరోసా ఇచ్చిందట.

కేసు దర్యాప్తు ఇంత స్పీడ్ గా జరుగుతున్న తరుణంలో.. టీడీపీ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దల పేర్లు బయటపెడుతున్నారన్న అక్కసుతో.. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ ను సెలవులో పంపారని ఆరోపించారాయన. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అది నిజమే అని ప్రజలు నమ్మితే తమ పరిస్థితేంటని భయపడుతోంది.

మరిన్ని వార్తలు

చిన్నమ్మకు షాకిచ్చిన పోలీసమ్మ

చాంతాడంత లిస్ట్ ఇచ్చిన అయ్యన్న