హీరో నిఖిల్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ‌వ‌ర్మ

హీరో నిఖిల్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ‌వ‌ర్మ

“శిఖ‌రాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హాశిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు. మీకు అర్థం అయిందిగా..” అంటూ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను ప‌రోక్షంగా కుక్క‌తో పోలుస్తూ హీరో నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి వర్మ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. బుధ‌వారం ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న అస‌లు నిఖిలెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.

“నిఖిల్ అయినా, కిఖిల్ అయినా అంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింద‌ తొత్తుల్లా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే ప‌వ‌న్‌కు వీరిమీద‌ మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని వాళ్ల ఆశ‌. అది బానిస‌త్వం అనే బుద్ధిలో నుంచి వ‌చ్చే ఆశ‌. కానీ నాకు నిఖిలెవ‌డో తెలీదు. అత‌నో పెద్ద స్టార్ అయిండొచ్చు. కానీ నాకు మాత్రం తెలీద”ని చెప్పుకొచ్చారు.

కాగా పీకేను టార్గెట్ చేస్తూ వ‌ర్మ “ప‌వ‌న్ క‌ళ్యాణ్‌: ఎన్నిక‌ల తరువాతి క‌థ” అనే సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం చేస్తూ ఆ సినిమా ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ల‌కు డిస్‌లైక్‌లు కొడుతూ క‌సి తీర్చుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు ప‌వ‌న్ వీరాభిమానులు వ‌ర్మ‌ను ఉద్దేశిస్తూ “ప‌రాన్న జీవి” సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్ కూడా విడుద‌లైంది. దీనిపై వ‌ర్మ స్పందిస్తూ.. “నాకు మీడియా ప‌రాన్న‌జీవి, మీడియాకు నేను ప‌రాన్న‌జీవి” అని పేర్కొన్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫ్యాన్స్ ప‌రాన్న జీవులు, ఫ్యాన్స్‌కు పీకే ప‌రాన్న‌జీవి అని చెప్పుకొచ్చారు.