ప్రముఖ దర్శకుడు క్రిష్ బాయ్య హీరోగా సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నందమూరి తారకరామారావు జీవితగాథతో ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగం ఎలా మొదలైంది, ఈ సమయంలో ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేవి చూపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన లక్ష్మిపార్వతి గురించి కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను గురించి కానీ ఈ చిత్రంలో చూపించడం లేదు. ఈ విధంగా కేవలం కొన్ని విషయాలనే తెరపై చూపించడానికి క్రిష్, బాయ్యలు ప్లాన్ చేశారు. రెండు పార్టులుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు.
క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలకు ధీటుగా రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టుగా తాజాగా ప్రకటించాడు. సరిగా తీయాలి కానీ క్రిష్ కంటే వర్మనే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఎలా ఎదిగాడో అందరికి తెలుసు, చాలా సులభంగా ఆయన అనతి కాలంలోనే మంచి పేరును సొంతం చేసుకున్నాడు.
అయితే లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేవి ఇప్పటికి క్లారిటీగా బయటకు రాలేదు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచాడు ఆసమయంలో జరిగిన ఆసక్తికర సంఘటలను వర్మ ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’తో తెరపై చూపిస్తా అన్నాడు. కాబట్టి క్రిష్ కథ కంటే వర్మ కథపైనే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వర్మ ప్రత్యేక శ్రద్దతో తీస్తే ప్రేక్షకుల నుండి తప్పకుండా మంచి స్పందన వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.