Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు ఎంత సంచలనాత్మకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే భారత్… అమెరికా స్థాయికి చేరుకుంటుందని వర్మ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో భారత్ కూడా ఒక దేశం. అదే రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.0 నుంచి 200.జీరోకు చేరుతుంది అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు వర్మ పెళ్లి, చావుపైనా తన అభిప్రాయం కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టంచేశారు. వర్మ దృష్టిలో పెళ్లి, చావు ఒకటేనట. వివాహం, అంత్యక్రియలు నాకు ఇష్టం ఉండదు. ఒకటి స్వేచ్ఛ కోల్పోయేందుకు చేస్తే… మరొకటి దేహం చనిపోయినందుకు చేస్తారు అంటూ వర్మ ట్వీట్ చేశారు.