ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష పడింది ……!

RGV sentenced to 3 months in prison......!
RGV sentenced to 3 months in prison......!

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం గురించి అందరికీ తెలిసిందే. అయితే తాను లేటెస్ట్ గానే తన గాడి తప్పిన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తానని భారీ మూవీ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ మార్పు రాకముందు చేసిన కొన్ని పనులు మాత్రం తనకి ఇపుడు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పాలి. అలా ఒక కేసులో ఇపుడు రామ్ గోపాల్ వర్మ మూడు నెలలు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే 2018 లో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మ కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేయడం జరిగింది. ఇరువురి నడుమ ఆర్ధిక లావాదేవీల విషయంలో వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మిశ్రా కేసు ఫైల్ చేయగా 2022 లో వర్మ మధ్యంతర బెయిల్ కూడా తెచ్చుకున్నారంట .

RGV sentenced to 3 months in prison......!
RGV sentenced to 3 months in prison……!

కానీ కేసు నడుస్తున్నప్పటికీ మధ్యలో వర్మ హియరింగ్ లకు తరచూ గైర్హాజరు అవ్వడం కూడా చేయడంతో ఇపుడు ముంబై అంధేరి కోర్ట్ వారు నాన్ బెయిలబుల్ 3 నెలల జైలు శిక్ష విధించారు. సెక్షన్ 138 ప్రకారం తనకి మూడు నెలల జైలు శిక్షతో పాటుగా 3.72 లక్షల జరిమానా కూడా అంధేరి కోర్టు విధించింది. ఒకవేళ ఈ మొత్తం కానీ కట్టని పక్షంలో మరో మూడు నెలలు జైల్లో ఉండాల్సిందే అని తీర్పునిచ్చినట్టు కూడా కన్ఫర్మ్ అయ్యింది.