లక్ష్మిస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ను టార్గెట్ చెయ్యడం లేదా?

RGV Targeting Chandrababu Naidu with Lakshmi's NTR Movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇటివల వెన్ను పోటు అనే సాంగ్ ను విడుదల చేశాడు. ఈ సాంగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ వర్మ ఈ సాంగ్ ను విడుదల చేశాడు. ఈ సాంగ్ పై తెలుగుదేశం పార్టీ తమ్ములు వర్మ పై ఆగ్రహం తో ఉన్నారు. పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కూడా అయ్యాయి. అయితే వర్మ మాత్రం ఆ సాంగ్ ను కేవలం పబ్లిసిటీ కోసమే ఆ సాంగ్ ను రూపొందించాడంట. లక్ష్మిస్ ఎన్టీఆర్ లో ముఖ్యంగా చూపించేది. అయన రాజకియలోకి వచ్చిన తరువాత ఏ విధంగా తెలుగు ప్రజల మనసును గెలుచుకున్నాడనే విషయాలని చూపబోతున్నాడు.

అయన ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాడు, ఎన్టీఆర్ కు ఆమెలో నచ్చిన అంశం ఏంటి అనేది ప్రధానంగా చూపిస్తాడు. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్లో మాత్రం ఎన్టీఆర్ సినిమా రాజకీయ అంశాలతో ముడిపడిన జీవితాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితాన్ని ఇద్దరు స్టార్ డైరక్టర్స్ రూపొందిస్తున్నారు. ఇందులో ఎవరు పై చెయ్యి సాదిస్తారు అనేది ఇంకో రెండు వారలు ఆగలిసిందే. వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ తో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ చూపిస్తే మాత్రం రానున్నఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ పై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి వర్మ లక్ష్మిస్ లో ఏదైనా జరగవచ్చు.