ఆ కామెడీని మళ్ళీ ఇందులో చూస్తారు

Anil Ravipudi Speech At F2 Movie Audio Launch

అనిల్ రావి పూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్నారు. మేహ్రిన్, తమన్నా కథానాయకులుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్2 చిత్రం రూపొందింది. ఇటివల ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. టిజర్ లో చూపించిన విధంగా భార్యను ఎలాగైనా కాంట్రోలో పెట్టాలని వరుణ్, వెంకటేష్ లు భావిస్తుంటారు. ఆ టైం లో వచ్చే కామెడీ సిన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ ఇటివల హైదరాబాద్ లో జరుపుకుంది.

చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ….వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ చాలా అద్బుతంగా వచ్చింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల మాదిరి అంత కామెడీ ఎఫ్2 చిత్రంలో ఉంటుంది అన్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు చాలాకాలం తరువాత హాస్యని తనదైనా స్టైల్ లో పండిన్చాబోతున్నారు అన్నారు. అంటే ఎఫ్2 పూర్తిగా కామెడీతో కుడి ఉంటుంది. ఈ చిత్రాని ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. దిల్ రాజు ఈ సినిమాను చాలా నమ్మకంగా నిర్మించాడు. గా కొన్నాళ్లుగా దిల్ రాజుకు టైమ్ సరిగా లేదు. 2018వ సంవత్సరం దిల్ రాజుకు అంతగా కలిసి రాలేదు. కానీ 2019 ని మాత్రం సక్సెస్ తో ప్రారంభిస్తాననే నమ్మకం ఆయనలో కనిపిస్తుంది.