పవన్‌ కంటే కత్తి మహేష్‌ అందగాడు : వర్మ

RGV Tweets Kathi Mahesh Is More Handsome Than Pawan Kalyan
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, కత్తి మహేష్‌ ఇష్యూ ప్రస్తుతం మీడియాలో ఏ రేంజ్‌లో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలు పవన్‌ ఫ్యాన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక వర్మ ఎలాగూ పవన్‌ను విమర్శించేందుకు ఉండనే ఉన్నాడు. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్‌ అంటూ వర్మ తన రివ్యూ ఇచ్చాడు. అదే విధంగా కత్తి మహేష్‌ ఇచ్చిన రివ్యూను కూడా వర్మ చూసి సమర్ధిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. పవన్‌ కళ్యాణ్‌ కంటే వీడియోలో కత్తి మహేష్‌ చాలా బాగున్నాడని, పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసితో ఆకట్టుకోలేక పోయాడు అంటూ వర్మ తేల్చి చెప్పాడు.

వర్మ తన గురించి ట్వీట్‌ చేయడంతో కత్తి మహేష్‌ ఉబ్బి తబ్బిబయ్యాడు. థ్యాంక్యు సర్‌ అంటూ వర్మ ట్వీట్‌కు కత్తి రీ ట్వీట్‌ చేశాడు. వీరిద్దరి చర్చ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. వర్మ, కత్తి మహేష్‌ల ట్వీట్‌లపై హైపర్‌ ఆదీ స్పందించాడు. వీరిద్దరి పద్దతి అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల తెల్లకాకి అన్నట్లుగా ఉందని ఎద్దేవ చేశాడు. వర్మ, కత్తి మహేష్‌ల ట్వీట్స్‌తో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకు వస్తుంది. సోషల్‌ మీడియాలో కత్తి, వర్మలపై ఫ్యాన్స్‌ దుమ్మెత్తి పోస్తున్నారు. పవన్‌ వంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవ్వడంతో వర్మ మరియు కత్తికు మంచి అవకాశం ఇచ్చినట్లయ్యింది అంటూ సినీ విశ్లేషకులు మరియు మీడియా జనాలు అంటున్నారు. ముందు ముందు కత్తి, వర్మల వ్యాఖ్యలు మరే రేంజ్‌లో ఉంటాయో చూడాలి.