పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడచుట్టూ వాచీ ధరించిన రిహన్నా.. ధర తెలిస్తే అంతే !

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడచుట్టూ వాచీ ధరించిన రిహన్నా.. ధర తెలిస్తే అంతే !
రిహన్నా

అమెరికన్ సింగర్, నటి రిహన్నా పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్‌లో మెడకు ధరించిన వాచీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లగా, అందంగా మెరిసిపోతున్న ఆ వాచ్ అందరి మనసులను కొల్లగొట్టింది. జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ దీనిని తయారుచేసింది. దీని విలువ దాదాపు రూ.5.7 కోట్లు.

వాచీని మెడకు చోకర్‌లా ధరించడం ఇదే తొలిసారి. మొత్తం 368 వజ్రాలు పొదిగిన 47 మిల్లీమీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లైయింగ్ టూర్‌బిల్లన్‌ను చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారుచేశారు. కాగా, రెండోసారి గర్భవతి అయిన రిహన్నా డెనిమ్ షర్ట్, జీన్స్, భారీ జాకెట్, బీనీలో బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ క్యాట్‌వాక్ చేసింది.