ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా

ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా

కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమిపాలై వరుసగా రెండో ఏడాది నిరాశనే మిగిల్చింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో త్రిపాఠి స్టన్నింగ్‌ సిక్స్‌తో కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ భావోద్వేగంగా స్పందించాడు.

”ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా. బాధతో నాకు మాటలు రావడం లేదు. కానీ మ్యాచ్‌ మా చేతుల్లో ఉండదు. మేము వీలైనంతసేపు ఆటలో గెలుపుకే ప్రయత్నించాం. ఆఖర్లో బౌలర్లు ఆటను మార్చినప్పటికి.. మ్యాచ్‌ గెలవలేకపోయాం.

ఇక ముందు బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం వచ్చినప్పటికీ మిడిల్‌ ఓవర్లో కేకేఆర్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ సమయంలో సరైన స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయాం. కానీ సీజన్‌లో మా ప్రదర్శన బాగానే అనిపించింది. కచ్చితంగా వచ్చే సీజన్‌లో మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం” అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు.