ఈ కరోనా ఏమో కానీ ఏ ఒక్కరికీ ఈ కొత్త సంవత్సరం అచ్చి రావడం లేదని నెటిజన్స్ సహా సామాన్య జనం వాపోతున్నారు. నిన్ననే బాలీవుడ్ లో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో కన్ను మూసిన వార్తే మొత్తం సినిమా ప్రపంచాన్నే శోక సంద్రంలోకి నెట్టేస్తే మళ్ళీ ఈ లోపు లోనే అదే బాలీవుడ్ కు చెందిన మరో లెజెండరీ నటులు రిషి కపూర్ మరణించారని బయటకొచ్చిన వార్త ఒక్కసారిగా ఇండియన్ సినిమా సహా దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం విష్మయ పరిచింది.
దీనితో నరేంద్ర మోడీ ఒక భావోద్వేగ పూరిత ట్వీట్ పెట్టి రిషి కపూర్ కు నివాళి అర్పించారు. “బహుముఖ ప్రజ్జ్ఞ్యాశాలి మరియు ఎంతో ఆహ్లాదకరమైన నటుడు రిషి కపూర్ అని,తాను టాలెంట్ కు ఒక పవర్ హౌస్ లాంటి వారు అని అతనితో గడిపిన రోజులు ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉండేవాడిని అని అతను దేశ సమగ్రతకు మరియు సినిమాల పట్ల చాలా ప్యాషన్ చూపించేవారని అలాంటి వ్యక్తి మరణం చాలా బాధాకరం అని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా” అని మోడీ స్పందించారు.
Multifaceted, endearing and lively…this was Rishi Kapoor Ji. He was a powerhouse of talent. I will always recall our interactions, even on social media. He was passionate about films and India’s progress. Anguished by his demise. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 30, 2020
Devastated to know Rishi Ji is no more. A great friend , A great artiste, heartthrob of millions. Carrier of a Great legacy. Feel so heartbroken at this loss. Farewell my friend #RishiKapoor. Rest in peace. pic.twitter.com/gBcdrIXvhO
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 30, 2020
Heartbroken … Rest In Peace … my dearest friend #RishiKapoor
— Rajinikanth (@rajinikanth) April 30, 2020
Rest in peace chintu sirrr, kaha suna maaf , strength , peace n light to family n friends…
— Salman Khan (@BeingSalmanKhan) April 30, 2020