రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లా పుల్కల మండంలోని చౌటకూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వారి వివరాలు..  హోసన్న గోని దీవెన భర్త లూకా , గ్రామము రంగంపేట కొల్చారం మండలం.  లూకా తండ్రి నారాయణ , గ్రామము రంగంపేట కొల్చారం మండలం. బుర్ర అంబదాస్ తండ్రి శాకయ్య , గ్రామం సంగాయి పేట్ కొల్చారం మండలం.  బుర్ర వివేక్, తండ్రి అంబదాస్ సంగాయి పేట్ కొల్చారం మండలం.  డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పోలీసులు దర్యా‍ప్తు చేస్తున్నట్లు తెలిపారు.