కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యానును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ వ్యానులో ప్రయాణిస్తున్న 11మంది మృతి చెందారు.
పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.