చలాకి చంటికి రోడ్ యాక్సిడెంట్

road accident to chalaki chanti

బుల్లితెర కామెడీ రియాల్టీ షో జబర్దస్త్ లో నటిస్తూ, పేరు తెచ్చుకున్న చలాకి చంటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు (టీఎస్ 07 జీఎం 0060) ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.  ఈ ఘటనలో చంటికి గాయాలు కాగా, అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కాగా, చంటి పలు తెలుగు చిత్రాల్లో కామెడీ నటుడిగా కనిపించి మెప్పించాడు.