పెళ్లిళ్ల పేరుతో డబ్బులు దోచుకోవడమే తమ లక్ష్యం

పెళ్లిళ్ల పేరుతో డబ్బులు దోచుకోవడమే తమ లక్ష్యం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నింబహెరా పీఎస్ పరిధిలోని గ్రామానికి చెందిన జయరామ్ మాలవీయ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈ ఏడాది జులై 4న మధ్యవర్తుల ద్వారా ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వధువు పేరు నేహా అని చెప్పి.. ఆమె తరఫున ముగ్గురు వ్యక్తులు జయరామ్ ఇంటికి వచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. మధ్యవర్తిత్వానికి కమిషన్‌గా రూ.1.10 లక్షలకు బేరం కుదిరింది. జులై 9న వివాహం జరగడంతో ఆ మొత్తాన్ని జయరామ్ వారికి ఇచ్చేశాడు.

పెళ్లయిన వారం రోజుల తర్వాత జులై 16న లారీలో సరుకులు వేసుకుని ఉజ్జయిని వెళ్లాడు. అదే అదునుగా భావించిన నేహ ఇంటి నుంచి పారిపోవడానికి ప్లాన్ వేసింది. ఇంట్లో ఉన్నవారికి టీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. వారు నిద్రలోకి జారుకోగానే అక్కడ నుంచి జారుకుంది. కానీ, పక్కింట్లో ఉండే జయరామ్ సోదరి విషయం తెలుసుకుని అతడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో జయరామ్ నేహ గురించి వెతుకుతుండగా ఆమె ఓ బస్టాప్‌లో కంటబడింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది.

పెళ్లిళ్ల పేరుతో డబ్బులు దోచుకోవడమే తమ లక్ష్యమని, ఇందులో మరో ముగ్గురు ఉన్నారని చెప్పింది. ఆమె ద్వారా సమాచారం అందుకున్న స్వప్న, సీమ, షబీర్‌ అనే మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు నేహది వారణాసిగా గుర్తించారు. స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్తున్నట్టు తల్లి మున్నీదేవికి అబద్దం చెప్పిన నేహా.. తిరిగి రాకపోవడంతో ఆమె తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. ఎక్కడున్నవాని ప్రశ్నించడంతో స్నేహితులతో కలిసి చిత్తోర్‌గఢ్ వెళ్లినట్టు చెప్పింది.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుని, చాలా మంది యువకులను ఈ ముఠా బురిడీ కొట్టించినట్టు గుర్తించారు. జయరామ్‌ మాలవీయతో పాటు మరి కొందరు బాధితులు వీరి జాబితాలో ఉన్నారు. ముఠాలో నేహా కీలక పాత్రధారని పోలీసులు తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులతో మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు.