చెప్పినట్లుగానే “2.ఓ” ని పైరసీ చేసింది…!

Robo 2.0 MOvie Leaked On Tamilrockers

రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.ఓ ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు మంచి టాక్ ను సంపాదించుకొని కలెక్షన్స్ వర్షం కురుపిస్తుంది. 2.ఓ విడుదలైన కొద్ది గంటలకే ఈ చిత్రం పైరెట్ సైట్స్ లో విడుదలైంది. గతంలో 2.ఓ చిత్రాన్ని పైరసీ చేస్తాం అని తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ హెచరించ్చింది. చెప్పిన విధంగానే 2.౦ విడుదలైన కొద్ది గంటలలోనే ఈ చిత్రం లింకులు తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ లో దర్శనం ఇచ్చాయి.

robo-movie

ఈ వెబ్ సైట్ పైన తమిళ హీరో విశాల్ గత కొంత కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. తమిళ రాకర్స్ దెబ్బకు చిత్ర నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 2.ఓ చిత్రం పైరసీ కావడంతో లైకా ప్రొడక్షన్స్ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2.ఓ చిత్రం ఒప్పెనింగ్స్ పరంగా అద్భుతంగా కలెక్షన్స్ సాదిస్తున్న ఇకా మీదట సినిమా నిలబడగలదా అనే సందేహాని వ్యక్తం చేస్తున్నార. 2.ఓ చిత్రం గ్రాఫిక్స్ తోకుడుకున్నా చిత్రం కాబట్టి ప్రతి ప్రేక్షకుడు సినిమాను ధియేటర్ లోనే చూస్తాడు అనే దైర్యంతో నిర్మాతలు ఉన్నారు. ఇకా మీదట వచ్చే సినిమాలను పైరసీ కాకుండా తమిళ రాకర్స్ పైన చర్యలు తీసుకుంటాం అని సినీ వర్గాల వారు అంటున్నారు.