రోహిత్ @ 2

rohit at second

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి రోహిత్ దగ్గరగా వచ్చాడు. ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 891 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వరుస సెంచరీలతో అదరగొడుతున్న రోహిత్ (885) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. బౌలర్లలో టీమ్‌ఇండియా ఆటగాడు బుమ్రా అగ్రస్థానంలో ఉండగా.. బౌల్ట్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.