తొలి రోజు వర్షం కారణంగా మూడు ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కాగా, మరుసటి రోజు దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచినందున బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో రోజు ఆటలో ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, రోహిత్‌లు ఆరంభించారు. ఫిలిండర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి రోహిత్ పెవిలియన్ చేరి, క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఓపెనర్‌గా రోహిత్ సక్సెస్ అవుతాడు అనేది తెల్సిన వాస్తవమే. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ రోహిత్‌శర్మని ఓపెనర్‌గా పంపగా, పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వికెట్ సమర్పించుకున్నాడు.