ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచుకున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి తాజాగా కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతానికి తమిళనాట గత కొద్దిరోజులుగా దర్బార్ సినిమాకు సంబందించిన ఒకరకమైన వివాదం జరుగుతున్నా సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దర్భార్ సినిమాకు సంబందించిన వివాదం పై దర్శకుడు సెల్వమణి స్పందిస్తూ, దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వివాదంలో దర్బార్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, కావాలనే ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ ను టార్గెట్ చేయడాన్ని దర్శకుడు సెల్వమణి తప్పుబడుతున్నారు. అంతేకాకుండా ఒక సినిమా కి సంబంధించి హీరోలు, నిర్మాతలతో వివాదాలు ఉన్నటువంటి తరుణంలో ఇలా సినిమాకు సంబందించిన టెక్నీషియన్లను టార్గెట్ చేయడం సరి కాదని దర్శకుడు సెల్వమణి సంచలనమైన కామెంట్స్ చేశారు.