రోజాపై జగన్ కి కంప్లైంట్ లో నో లాజిక్. 

Roja-main-leader-for-ycp-an

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైసీపీ లో రోజా కి వుండే ప్రధాన పని ఏమిటో అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబుని నాన్ స్టాప్ గా ఆడిపోసుకోవడం. వైసీపీ అధినేత జగన్ స్వయంగా రోజాకు ఇలాంటి ఆదేశాలు ఇస్తారు అనడానికి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ ఏడాది జరిగిన వైసీపీ ప్లీనరీలో మైక్ వుందో,లేదో చూసుకోకుండా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడిన మాటలే సాక్ష్యం. ప్రసంగించబోతున్న రోజా దగ్గరికి వచ్చి చంద్రబాబుగారిని బాగా తిట్టమంటున్నారు అని ఉమ్మారెడ్డి చెప్పిన విషయం ఇంకా యు ట్యూబ్ ఛానల్ లో అలాగే వుంది. 

తాజాగా రోజా కి చంద్రబాబుని తిట్టే పనితో పాటు మరో కొత్త పని కూడా అపాయజెప్పారట వైసీపీ అధినేత జగన్. ఇకపై చంద్రబాబు తో సమాన స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా కన్ను వేయాలని జగన్ నుంచి రోజా కి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె ఫోకస్ ఇప్పుడు పవన్ వైపు మళ్లింది. బండ్ల గణేష్ తో వివాదం ఎపిసోడ్ తర్వాత పార్టీ కి రోజా మాట తీరు మీద పెద్ద ఎత్తున ఆక్షేపణలు వచ్చాయట. పవన్ ని కౌంటర్ చేయడంలో రోజా ఫెయిల్ అయ్యారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట .  ఇలాంటివి ఇటు రోజాకు , అటు వైసీపీ కి కొత్త కాదు. ఎవరెన్ని చెప్పినా ప్రత్యర్థుల మీదకు రోజాని ప్రయోగిస్తున్న జగన్ కి ఆమె నోటి దూకుడు గురించి వేరే వాళ్ళు చెప్పాలా ? ఆమె నోరు ఎలాంటిదో తెలిసే జగన్ ఆ అస్త్రాన్ని వాడుతున్నారని ఇలా ఫిర్యాదులు చేసేవాళ్ళు ముందుగా తెలుసుకోవాలి.