పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని, వ్యాలీ షాప్ హౌస్ లో ని స్కూల్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏపీ మాజీ సిఎం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రమాదం గురించి విన్న వెంటనే తన మనసు ఎంతో కలత చెందిందని.. చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు.