రౌనక్ సిధ్వాని భారత 65వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. నాగ్‌పూర్ కు చెందిన ఈ గ్రాండ్ మాస్టర్ రష్యా గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండర్ మోతిలెవ్ పై రౌనక్ 37 ఎత్తుల్లో గెలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను పొందాడు.
- పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన ప్లేయర్ స్థానం లో రికార్డు రష్యా కి చెందిన సెర్గీ కర్జాకిన్ ఉన్నాడు. జీఎం హోదా పొందిన సమయం లో ఇతని వయసు 12 ఏళ్ల 7 నెలలు.
- మన భారత్ నుండి మొదటి స్థానం లో డి.గుకేశ్ రెండవ స్థానం లో ప్రజ్ఞానంద ఉన్నారు. జీఎం హోదా పొందినపుడు డి.గుకేశ్ 12 ఏళ్ల 7 నెలల 17 రోజులు ఇంకా ప్రజ్ఞానంద 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసు కలిగి ఉన్నారు.
ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నీన తొమ్మిదో రౌండ్లో అలెగ్జాండర్ మోతిలెవ్ తో పోటీ పడి భారత 65వ గ్రాండ్‌మాస్టర్ గా రౌనక్ సిధ్వాని నిలిచాడు. ఈ టోర్నీలో రేటింగ్ పాయింట్లు 2500 దాటడంతో రౌనక్ సిధ్వానికి జీఎం హోదా వశం అయింది. చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో జీఎం హోదా పొందిన వారి ఖాతాలో చేరాడు. 13ఏళ్ల 9నెలల 28రోజులు రౌనక్ సిధ్వాని భారత్ తరపున ఈ ఘనత పొందిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.