ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…

ఆనంద్ దేవరకొండ ‘బేబీ’రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే...
Baby

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైనా.. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బేబీ.. వచ్చినప్పటి నుంచీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆనంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు.

ఇప్పటికే పలు సాంగ్స్ విడుదల కాగా.. ఈ సినిమా నుంచి త్వరలోనే నాలుగో పాటను విడుదల చేయనున్నారు త్వరలోనే నాలుగో పాటను విడుదల చేస్తామని వెల్లడించరూ . తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. వచ్చే నెలలో అంటే జూలై 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది.