మొత్తం 13,487 జేఈ పోస్టులు ఇంకా డిపో మెటీరియల్ సైపరింటెండెంట్, కెమికల్ & మెటర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టేజ్-2 పరీక్ష ఐదురోజులపాటు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకు నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తదుపరి దశ లో ఉంటుంది.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే అభ్యంతరాలు సెప్టెంబరు 29 వరకు తెలుపవచ్చు. ఆన్సర్ కీతో పాటు ఆన్సర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో రిక్రూట్మెంట్ బోర్డు అందుబాటులో ఉంచింది. తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ తో లాగిన్ అయి అభ్యర్థుల ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు ఉంటే ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించవలసి ఉంటుంది.