బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో రాం చరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్నారు. మెగా మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సిని పెద్దలంతా ఈ సినిమా ముహుర్త కార్యక్రమానికి వచ్చారు. చిరంజీవి క్లాప్ కొట్టగా కే.రాఘవేంద్ర గౌరవ దర్శకత్వంలో మొదటి షాట్ తీశారు.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ లో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడట. అంతేకాదు అతని ఆహార్యంతో పాటుగా భాష కూడా కొత్తగా ఉంటుందట. బాహుబలి సినిమాలో కిలికి భాషని ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం కొత్త భాషని ప్రవేశ పెడుతున్నాడట. కేవలం ఎన్.టి.ఆర్ కోసమే ఈ భాషా ప్రయత్నం మొదలు పెడుతున్నారట.
దీనికోసం తమిళ రచయిత కార్కితో పాటుగా తెలుగు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా సపోర్ట్ కూడా తీసుకుంటున్నారట.అసలే అంచనాలు తారాస్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా వచ్చిన ఈ అప్డేట్ అటు మెగా ఇటు నందమూరి అభిమానులను ఉత్సాహంలో నింపింది. 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ టైటిల్ రామ రావణ రాజ్యం అని ప్రచారంలో ఉంది.