‘పద్మావత్‌’ దర్శకుడిని చంపేయండి

Rs. 51 lakh bounty on padmavat director head

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంజయ్‌ లీలా భన్సాలీ ‘పద్మావతి’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి కూడా రాజ్‌పుత్‌లు అడ్డు తలుగుతూనే ఉన్నారు. షూటింగ్‌కు పలు సార్లు అడ్డంకులు కలిగిస్తూ వచ్చారు. అయినా కూడా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తాను అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేశాడు. విడుదల సమయంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ చిత్రాన్ని విడుదల కానివ్వం అంటూ తేల్చి చెప్పడంతో సుప్రీం కోర్టు ముందుకు వెళ్లి అనుమతిని తెచ్చాడు భన్సాలీ. సినిమా విడుదలైంది, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాకు విశేష ఆధరణ లభిస్తుంది. ఈ సమయంలో రాజ్‌పుత్‌ మహాసభలో భన్సాలిని చంపేయాలి అంటూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఆల్‌ ఇండియా బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ భన్సాలీ తల తీసుకు వచ్చిన వారికి 51 లక్షల రూపాయల బహుమానం ఇవ్వబడును అంటూ ప్రకటించింది. అంతకు ముందు దీపిక పడుకునే చెవులు, ముక్కు కొసుకుని తీసుకు వచ్చిన వారికి కోటి రూపాయల నజరానా అంటూ ప్రకటించడం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత ఈ వివాదం తొలగి పోతుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా విడుదల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భద్రత సిబ్బంది కాపలాగా ఉన్నారు. రాజ్‌పుత్‌లకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా వారి వద్దకు వెళ్లకుండా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి పద్మావతి చిత్రం విడుదల తర్వాత కూడా సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది.