జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో.. ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడిని మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట్‌కు చెందిన లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు కామారెడ్డి డిపోకు చెందినది.