కేసీఆర్ నిర్ణయానికి ఆర్టీసీ కార్మికుల హర్షం

కేసీఆర్ నిర్ణయానికి ఆర్టీసీ కార్మికుల హర్షం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గత కొద్దీ రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెని విరమించి, కార్మికులు ఎట్టకేళకు తమ విధుల్లో చేరారు. ఈమేరకు సీఎం కేసీఆర్ అన్ని డిపోల కార్మికులతో ఇటీవలే ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాగా అయితే ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి అప్పుడు ఆర్టీసీ కార్మికులు అందరు కూడా హర్షం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మాట మార్చారని సమాచారం. కాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ ఆఫర్‌ను ఆర్టీసీ డ్రైవర్లు ఒప్పుకోవడం లేదని సమాచారం. అయితే 50 ఏళ్ళు దాటిన డ్రైవర్లకు అనారోగ్య సమస్యలు తీవ్రతరం అవుతాయని, 60 ఏళ్ళ వరకు బస్సు నడపాలంటే కష్టం అని వెల్లడించారు.

కాగా సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికుల అభిప్రాయాల సేకరణ కోసం అక్కడ ఒక బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఆర్టీసీ కార్మికులు తమ అభిప్రాయాలను రాసి, ఆ బాక్సులో వేశారు. అయితే చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు వయసు నిబంధన పెంచకూడదని వెల్లడించారు. 60 ఏళ్ల వయసు వరకు బస్సు నడపడం వలన ఆర్టీసీ డ్రైవర్లు దృష్టి లోపాలు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, గుండె నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారని, కొందరు కార్మికులు విధుల్లో ఉండగానే మరణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే వీరందరూ కూడా స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయాలనీ కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.