దొంగ స్వామి పై మండి పడ్డ మంచు మనోజ్

దొంగ స్వామి పై మండి పడ్డ మంచు మనోజ్

ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దారుణ సంఘటనలు దేశ వ్యాప్తంగా ఎంత కలకలం రేపాయో అందరికి తెలిసిందే.అలాగే ఇదే సందర్భంలో అదొక్కటే కాకుండా జస్ట్ ఈ రెండు మూడు రోజుల్లోనే అలంటి ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను మరింత కుంగదీసింది.అయితే మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే నిస్సాయ స్థితిలో టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ చాలా భావోద్వేగానికి గురయ్యి తనలోని భావాలను మీడియా సమక్షంలో వెలుబుచ్చుకున్నారు.

ఇదిలా ఉండగా మంచు మనోజ్ దేశంలోని ఓ దొంగ స్వామి కోసం ఒక సంచలన ట్వీట్ పెట్టారు.అత్యాచార ఆరోపణలులో ఇరుక్కున్న నిత్యానంద స్వామి దేశం విడిచి పెట్టి తనకంటూ ఉన్న ఒక స్పెషల్ దీవిలో దాక్కున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా మనోజ్ అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అసలు “ఈ ఇడియట్ ఒక దీవి కొన్నాడా?అసలేం జరుగుతుంది?గవర్నమెంట్ వారు అతను ఉన్న దీవి పై ఒక బాంబు వెయ్యండి” అని ట్వీట్ చేసారు.మరి దీనిపై ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.