అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు

అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియా లో ఎంతలా ఆక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. నిత్యం ప్రజలకి, ఉద్యోగులకు, అందరికి సంబంధించి, వారికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ అందరి మన్ననలను పొందుతుంది. కాగా తాజాగా ఉపాసన మరొక వీడియోని విడుదల చేసింది. తాజాగా ఉపాసన తన యూట్యూబ్ చానెల్ ద్వారా పిల్లలందరిని దుర్మార్గమైన కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశం పై ఒక వీడియో ని చేసి, తన ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరి కోసమని విడుదల చేసింది.

కాగా ఈ వీడియో లో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు ఉపాసన. ఇకపోతే దేశంలో ప్రస్తుతానికి మహిళలు, బాలలపై లైంగిక పరమైన క్రూరమైన దాడులు ఎక్కువగా జరుగుతున్నా తరుణంలో మెగా కోడలు ఉపాసన తీసుకున్న ఈ చొరవకు అభిమానులు అందరు కూడా సలాం కొడుతున్నారు.