ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ణయం తీసుకున్న నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ణయం తీసుకున్న నిర్ణయం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వం లో విలీనం చేసే చర్యని మంత్రుల సమక్షంలో బిల్లుని ఆమోదించడం జరిగింది. అయితే అదే బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఆమోదించారు. ప్రభుత్వం ఏపీఆర్టీసీ చట్టం-2019 ఆమోదం తో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు అయ్యారు. 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇక ఫై నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు పొందనున్నారు. అయితే ఈ విలీనానికి సంబంధించి ఆర్టీసీ గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం తొందర్లో విడుదల చేయనుంది. అయితే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీచేసిన సందర్భంలో నేషనల్ మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 1 వ తేదీ నుండి వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు.