రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల ప్రమాదం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పని ఉంటే తప్ప.. బయటకు రావద్దని సూచించింది. రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా సత్యవేడులో 44.12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 45 నుండి 47 డిగ్రీల సెంటీగ్రేడ్కుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు: గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు , చిత్తూరు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు. 43 నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, అనంతపురం , విశాఖ. 41 నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, చితూరు.