‘సైరా’ నయనతార పుకార్లపై క్లారిటీ

rumours on nayanthara over sye raa movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్‌ షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘సైరా’ చిత్రానికి సంగీతంను ఏఆర్‌ రహమాన్‌ అందించబోతున్నట్లుగా మొదట ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుండి రహమాన్‌ తప్పుకున్నాడు. ఆ స్థానంలో ఇంకా మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేయలేదు. ఇక హీరోయిన్‌ నయనతార కూడా ఈ చిత్రం నుండి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంలో లెక్కకు మించిన చిత్రాలను నయనతార చేస్తున్న విషయం తెల్సిందే. సౌత్‌లోనే నెం.1 హీరోయిన్‌గా దూసుకు పోతున్న నయనతార సైరా షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో డేట్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడినదని, దాంతో ఆమె సైరా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

syera-narasimha-reddy-direc

‘సైరా’ నుండి నయన్‌ తప్పుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. నయన్‌ తప్పుకున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని కేవలం పుకార్లు మాత్రమే అంటూ తేల్చి పారేశారు. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సైరా చిత్రం రెండవ షెడ్యూల్‌ను అతి త్వరలోనే ఆరంభించబోతున్నారు.

syeraa-movie-news

రెండవ షెడ్యూల్‌ మద్యలో అంటే ఫిబ్రవరి రెండవ వారంలో నయనతార చిత్రీకరణలో పాల్గొనబోతుందని, ఇప్పటికే ఆమె డేట్లు కూడా ఖరారు అయ్యాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాఋ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. 2018 చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.