ఉక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. 21 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్‌లోని బుర్నాలాకు చెందినవాడు. ఫిబ్రవరి 2న అనారోగ్యానికి గురైన అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వైద్యం అనంతరం అనారోగ్యం కారణంగా చందన్ మరణించినట్లు మంగళవారం అధికారలు తెలిపారు.