బీట్‌రూట్ తింటే కళ్ళు ఆరోగ్యం

బీట్‌రూట్ తింటే కళ్ళు ఆరోగ్యం

సమస్యల ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా, అందమైన కళ్లను, మెరుగైన చూపును జీవిత కాలం పొందవచ్చు.ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో కళ్ల ఆరోగ్యం దయనీయంగా మారింది. రాత్రింబవళ్లు.. కాంతులు వెదజల్లే తెరలను చూస్తూ కళ్లకు అలసట కలిగిస్తున్నాం. రాత్రి నిద్రపోయేప్పుడు కూడా కళ్ల ముందు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.

అలాగే, టీవీలు, ట్యాబెట్లతో గడుపుతూ కనీసం విశ్రాంతి కూడా ఇవ్వడం లేదు. వర్క్ ఫ్రం హోం చేసేవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఆఫీసులో కంటే.. ఎక్కువ సమయం ఇంట్లో ల్యాప్‌టాప్‌లను చూసేందుకే కేటాయించడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు కళ్లను సైతం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ కింది సూపర్ ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పోషకాలతోపాటు విటమిన్-ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ డీజనరేషన్ సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

పిల్లలకు బాల్యం నుంచే ఆకు కూరలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి.. మీరు తీసుకొనే డైట్‌లో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయస్సు మీదపడినా సరే కంటి చూపు మందగించదు.

డార్క్ చాక్లెట్స్‌లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కాటరాక్ట్స్‌ను తొలగిస్తుంది. అంతే కాదు సాధారణ కంటి చూపును మెరుగుపరిచి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే ఐరెన్ అధికంగా ఉంటుంది.

వీటిల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ డిహెచ్ ఎ, ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్‌ని అడగటం మంచిది. ఇందులో ఉన్న బిటమిన్ బి సెల్ ఫంక్షన్ కు ఎక్కువగా ఉపయోగపడుతుంది.పుల్లని పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బెర్రీస్‌లో ఇది లభిస్తుంది. ఇది కంటిశుక్లం , మాక్యులర్ క్షీణత సమస్య దరిచేరకుండా కళ్లను కాపాడుతుంది. ఇకపై మీ డైట్‌లో తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోండి.

చిక్కుళ్లు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు గురించి మీకు తెలుసా? వీటిని మీరు తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి. ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింగ్ మీ రెటీనా‌ను కాపాడతాయి. కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి.ముదురు పసుపు వర్ణం, ఆరెంజ్ బెల్ పెప్పర్స్ వీటిల్లో విటమిన్ A, C, లూటిన్, జియాక్సిథిన్ ఉండటం మూలంగా కాంటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.

మన కళ్లు ప్రకాశవంతమైన దృశ్యాలను చూసినప్పుడు మెదడుకు సరైన సిగ్నళ్లను పంపుతాయి. క్యారెట్, టమోటో, పెప్పర్స్, స్ట్రాబెర్రీస్, గుమ్మడి, మొక్క జొన్నల్లో విటమిన్-A, విటమిన్-C ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దరిచేరకుండా కాపాడతాయి.

వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటి ఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.ద్రాక్షలో ఆంథోసైనిన్ అధికంగా ఉండి, రాత్రిల్లో కంటి చూపును స్టాంగ్‌గా ఉండేలా చేస్తుంది. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడుల్లా ద్రాక్షపండ్లను తినొచ్చు.వీటిల్లో అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిండెంట్స్ ఉత్ప్రేరకాలు ఉన్న ఐసోఫ్లెవెన్స్ వల్ల కళ్ళకి వచ్చే dry eyes సిండ్రోమ్, కాంటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి.