ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిలో పడ్డ అందాల భామ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . ఒకవైపు కోరికతో రగిలిపోతూ, లోలోపల కుట్రలు చేయడం సినీ ప్రేక్షకలోకానికి కొత్తగా అనిపించింది. ఇక లిప్ లాక్ సీన్స్ లోను ఈ అమ్మడు అదరగొట్టింది. పాయల్ పాత్రని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వచ్చి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. దీంతో తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తుంది. రవితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చివరిగా సీత అనే చిత్రంలో మాస్ మాసాలా సాంగ్‌తో అలరించిన పాయల్ రాజ్‌పుత్ `RDX లవ్` అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలోను నటిస్తుంది.సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లోను నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్ ఇందులో వేశ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఆర్ఎక్స్ 100 చిత్రంలో మాదిరిగానే ఇందులోను పాయల్ రాజ్‌పుత్ పాత్ర బోల్డ్‌గా ఉంటుందని అంటున్నారు. చిత్రంలో టైగర్ నాగేశ్వర్ రావు పాత్రని బెల్లంకొండ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా అందరిని వణికించిన టైగర్ నాగేశ్వర్రావు బయోపిక్ ప్రేక్షకులని తప్పక అలరించనుందని అంటున్నారు