కేరళకు అండగా RX 100 హీరో….Rx 100 బండి వేలం !

rx 100 movie bike for auction
ఆప‌ద‌లో ఉన్నవారికి ఆప‌న్న హ‌స్తం అందించేందుకు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఎప్పుడు ముందుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అది 2014 హుడ్ హుడ్ నుండి మొన్నటి చెన్నైవరదల వరకు ఇలాంటి అన్ని సమయాల్లో తెలుగు హీరోలు అండ‌గా నిల‌బ‌డ్డారు. న‌గ‌దు, వ‌స్త్రాలు, ఆహారం రూపంలో సాయం చేశారు. తాజాగా కేర‌ళ‌లో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న వారిని ఆదుకునేందుకు మ‌న హీరోలు ముందుకొస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్ ఇలా ఒక్కరంటూ కాదు కాస్త స్టార్ డం ఉన్న వారంతా కేరళ కోసం తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.
rx 100 movie hero
తాజాగా రీసెంట్ సెన్సేషన్ RX 100 హీరో కార్తికేయ కూడా కేరళ వరద బాదితుల సంక్షేమార్ధం ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఏంటో ఇష్టమైన సినిమాకే ఒప్పిరి లాంటి RX 100 బైక్ ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు ఆ వచ్చిన డబ్బుని కేరళ బాదితులకి పంచడానికి సిద్దమయ్యాడు. ఈ బండి అంటే తనకు ఎంతో ఇష్టమైనా మనం కాకపోతే మన పక్క రాష్ట్రము వారికి ఇంకెవరు అండగా ఉంటారంటూ ఈ బైక్ వేలం వివరాలు ప్రకటించాడు.
rx-100-movie
ఈ వేలం లో పాల్గొందమనుకున్న వారు వారు వారు పాదదామనుకున్న మొత్తాన్ని [email protected] కి గానీ 9100445588కి వాట్సాప్ గానీ చేయాల్సిందిగా కోరాడు. దానికి మినిమం ఎమౌంట్ 50,000.