నీరవ్ మోడీ ఆచూకీ తెలిసింది !

indian-govt-sent-request-to-britain-to-handover-nirav-modi

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పంగనామం పెట్టి వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి తిరుగుతున్న నీరవ్ మోడీ ఆచూకి కోసం కొన్ని రోజులుగా పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు 13 వేల 500 కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై కేసును వేగవంతం చేసింది  సీబీఐ. ఈ క్రమంలోనే నీరవ్ మోడీ కూడా లండన్ లోనే ఉన్నట్లు అక్కడి అధికారులు భరత్ కి తెలియ చేశారు. దీంతో అతన్ని తమకు అప్పగించాల్సిందిగా ఆ దేశాన్ని కోరింది సీబీఐ. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కు స్కాంలో నీరవ్ మోడీతో పాటు, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

nirav-modi

నీరవ్ మోడీని అప్పగించాల్సిందిగా యునైటెడ్ కింగ్నుడం కోరినట్లు ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రభుత్వం కూడా పార్లమెంట్‌ కు తెలియజేసింది. లండన్‌ లోని ఇండియా హై కమిషన్‌ కు ప్రత్యేక దౌత్యమార్గంలో ఈ వినతిని పంపించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంట్‌ కు చెప్పారు. భారత్ ఇలా 2002 నుంచి 28 మందిని తమకు అప్పగించాల్సిందిగా ఆ దేశాన్ని కోరగా ఈ లిస్ట్‌ లో ఇప్పుడు  నీరవ్ కూడా చేరాడు. అయితే అలా చేసిన 28 విజ్ఞప్తిలలో 16సార్లు భారత్ రిక్వెస్ట్ ను తోసిపుచ్చింది యూకే.

indian-govt