Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏడేళ్ల బాలుడి దారుణహత్యతో గురుగ్రామ్ అట్టుడుకుతోంది. ఈ దారుణంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది అత్యంత కిరాతక మైన ఘటన అని నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖట్టర్ తెలిపారు. విచారణను వేగవంతం చేయాలని, ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని చెప్పారు. నివేదికలో స్పష్టత లేకపోతే ఎలాంటి విచారణ చేపట్టేందుకైనా సిద్దంగా ఉన్నామని ఖట్టర్ తెలిపారు.
గురుగ్రామ్ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం స్కూల్ టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో బాలుడు పడి ఉన్నాడు. చిన్నారి గొంతుపై బలంగా పొడిచినట్టు కత్తిగాట్లు ఉన్నాయి. స్కూలుకు వచ్చిన వెంటనే చిన్నారి టాయిలెట్ కు వెళ్లాడు. అప్పటికే టాయిలెట్ లో పొంచి ఉన్న అశోక్ రెడ్డి అనే బస్సు కండక్టర్ చిన్నారిని పట్టుకున్నాడు. ప్రతిఘటించిన చిన్నారి కేకలు వేయటంతో గొంతులో కత్తితో పొడిచి పరారయ్యాడు. టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన బాలుడు రక్తపు మడుగులో పడిపోయాడు.
చిన్నారిపై లైంగిక చర్యకు ప్రయత్నించిన అశోక్ అది సాధ్యం కాకపోవటంతో దారుణంగా హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అశోక్ కుమార్ ను పోలీసులుఅరెస్టుచేశారు. వారంరోజుల్లో దీనిపై ఛార్జ్ షీట్ దాఖలుచేస్తామని గుర్గావ్ పోలీస్ కమిషనర్ చెప్పారు. అటు సీబీఎస్ ఈ కూడా ఇద్దరితో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసింది. విచారణలో స్కూల్ నిర్లక్ష్యం, బాధ్యత ఉందని తేలితే పాఠశాల గుర్తింపు రద్దుచేస్తామని హెచ్చార్డీ మంత్రిత్వశాఖ అధికారి హెచ్చరించారు.
మరిన్ని వార్తలు: