బాక్స‌ర్‌గా సాహో న‌టుడు.. ఫ‌స్ట్ లుక్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్

saaho actor as boxer

కొన్నేళ్ళ నుండి వ‌రుస విజ‌యాల‌తో జెట్ స్పీడ్‌లా దూసుకెళుతున్న న‌టుడు అరుణ్ విజ‌య్. ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు అరుణ్ విజ‌య్. అయితే కొద్ది రోజుల క్రితం సాహో షూటింగ్ పూర్తి చేసుకున్న తాను ప్ర‌స్తుతం త‌న త‌దుపరి సినిమా బాక్స‌ర్‌తో బిజీగా ఉన్నాడు .ఇటీవ‌ల వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన ఓ వీడియోని త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే అరుణ్ త‌న పాత్ర కోసం భాగానే హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు అర్ధ‌మ‌యింది. బాక్స‌ర్‌గా అరుణ్ విజ‌య్ ఈ చిత్రంలో క‌నిపించ‌నుండ‌గా, రీసెంట్‌గా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అరుణ్ విజ‌య్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. వివేక్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. రితికా సింగ్‌, సంజ‌నా గ‌ల్రానీ క‌థానాయిక‌లుగా నటిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.