కళ్ళు బైర్లు కమ్మేలా సాహో బిజినెస్…

Lokesh Sensational tweets on Saho movie

సాహో సినిమా బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు అందరికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. విడుదలకు ముందే ఈ చిత్రం పూర్తిగా సేఫ్ జోన్ కు వచ్చేసింది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో విడుదలకు ముందు దాదాపు 330 కోట్ల బిజినెస్ చేస్తుంది.

ఇప్పటికే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలతో పాటు ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చేసాయి. దానికి తోడు సినిమా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోకుండా టి సిరీస్ 125 కోట్లు ఇచ్చి హిందీ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా దాదాపు 150 కోట్ల బిజినెస్ వరకు సాహో చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి తీసుకొచ్చిన లాభాలతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రభాస్ సినిమాపై ఎంత పెట్టడానికైనా సిద్ధంగానే కనిపిస్తున్నారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా రికార్డు బిజినెస్ చేస్తుంది సాహో. కేవలం ఇండియాలోనే దాదాపు 300 కోట్ల బిజినెస్ చేస్తుంది సాహో.

ఇక ఓవర్సీస్లో 36 కోట్లకు ఈ చిత్రం హక్కుల్ని ఫర్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ బాహుబలి సృష్టించిన సంచలనం వాళ్లు చూశారు కాబ‌ట్టి ప్రభాస్ మార్కెట్ భారీగా ఉందని న‌మ్మి ఇంత రేట్ పెట్టారు.  ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే 36 కోట్లు చిన్నగానే కనిపిస్తుంది.

దానికి తోడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అన్ని భాషలకు కలిపి 36 కోట్లు చెల్లించారు. దాంతో ఓవర్సీస్ లో సాహో సినిమా సేఫ్ కావాలంటే దాదాపు 10 మిలియన్ డాలర్స్ వసూలు చేయాలి. అది చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.