Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sabarinathan MLA married the IAS Divya S Iyer
కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓ ఐఏఎస్ ను ఓ యువ ఎమ్మెల్యే ముగ్గులోకి దించారు. కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు. వీరిద్దరి పెళ్లి కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐఏఎస్ దివ్య ఎస్ అయ్యర్ ను ఎమ్మెల్యే శబరినాథ్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి జంట కన్నుల పండువగా ఉందంటున్నారు కేరళ ఐఏఎస్ లు, ఎమ్మెల్యేలు.
తిరువనంతపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే శబరినాథ్, తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి అభిరుచులు, అలవాట్లు కలవడంతో.. ఇద్దరూ రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లిచేసుకోవడం అందర్నీ ఆకర్షించింది. వీరిద్దరి కాపురం ఎలా జరుగుతుందోనని అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది.
శబరినాథ్, దివ్య అయ్యర్ ల పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. దగ్గరి బంధువులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లి గురించి శబరినాథ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మొత్తం మీద వీరిద్దరి ప్రేమే ఓ సంచలనమైతే.. ఇరువైపులా పెద్దలు ఒప్పుకోవడం మరో హాట్ టాపిక్. మొత్తం మీద కేరళలో జరిగిన ఈ అరుదైన పెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శమౌతుందని కామెంట్లు పడుతున్నాయి.
మరిన్ని వార్తలు:
నంద్యాలలో సరికొత్తగా టీడీపీ ప్రచారం