Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అవసరానికి మించి చర్చ జరుగుతోంది. పనన్ బాబు, మోడీ జోడీని సపోర్ట్ చేశారు కాబట్టి సక్సెస్ ఫుల్ క్యాంపైనర్ అయ్యారు. అదే జగన్ ను చేసుంటే సక్సెస్ అయ్యేవాళ్లా. ఈ ప్రశ్నకు పవన్ దగ్గర ఆన్సర్ లేదు. జనసేన పార్టీ పెట్టి చాలాకాలమైంది. ఇంతవరకూ పవన్ చేపట్టిన మంచి పని ఏంటో ఎవ్వరికీ తెలీదు.
అలాంటి పవన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అయిపోతారని పవర్ స్టార్ అభిమానులు కలలు కంటున్నారు. ఇక్కడ చంద్రబాబు దెబ్బకు జగన్ కే చుక్కలు కనిపిస్తుంటే.. ఇక క్యాడరే లేని సేనాని ఏం చేస్తారని టీడీపీ తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. కానీ తమకు చాలా బలం ఉందని పవన్ కూడా భ్రమలో ఉన్నారు. శాంపిల్ గా కాకినాడలో బరిలోకి దిగితే బాగుండేదనని తమ్ముళ్లు సెటైరేస్తున్నారు.
2019 ఎన్నికల్లో పోటీచేస్తామని పవన్ చెప్పారు కానీ.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది జనసేనకు 175 మంది అభ్యర్థులు దొరకడం మామూలు విషయం కాదు. పైగా పవన్ చెప్పే ప్రసంగాలు జనానికి అంత వీజీగా అర్థంకావనే ప్రచారం కూడా ఉంది. ఏదో బాబుకు ఓటేయమంటే అర్థమైందని, ఆయన చెప్పే అర్థమయ్యీ కానీ విధానాలు ఎక్కడం చాలా కష్టం. ఈ సంగతి అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పవన్ ఎవరో ఒకరు గెలిచేలా సాయం చేయగలరు కానీ.. స్వయంగా రాణించలేరని చెప్పేశారు సబ్బం.
మరిన్ని వార్తలు: