క్రికెట్లో, లైఫ్‌లో విజయం తప్ప అపజయం లేదని అందరూ భావిస్తారు. కానీ తన జీవితానికి సంబంధించి తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌ను సచిన్ తెలిపాడు.సచిన్ టెండూల్కర్ అనగానే అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్, క్రికెట్ గాడ్, విజయాలకు కేరాఫ్ ఆడ్రస్ ఇవి మాత్రమే అందరికీ తెలుసు. అయితే సచిన్ జీవితం పూల బాట కాదని ముళ్లదారని కొందరికి మాత్రమే తెలుసు. క్రికెట్లో, లైఫ్‌లో విజయం తప్ప అపజయం లేదని అందరూ భావిస్తారు.
కానీ తన జీవితానికి సంబంధించి తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌ను సచిన్ తెలిపాడు. పశ్చిమ మహారాష్ట్రలోని ఓ పాఠశాలకు సచిన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మూడు కొత్త తరగతి గదులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టేజ్, గ్రౌండ్ నిర్మాణం కోసం తన ఎంపీ నిధులను మంజూరు చేశాడు.
పాఠశాలలోని కొత్త తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సచిన్ విద్యార్దులతో ముచ్చటిస్తూ ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహపడుకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నాడు. తన తొలి సెలక్షన్ ట్రయల్స్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొంటూ తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.